టీడీపీకి మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా: వైసీపీ వైపు చూపు

By narsimha lodeFirst Published Mar 12, 2019, 1:04 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
 

 రాయదుర్గం: మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని మెట్టు గోవింద్ రెడ్డి భావించారు. అయితే ఇదే స్థానం నుండి మరోసారి మంత్రి కాలువ శ్రీనివాసులు పేరును చంద్రబాబునాయుడు ప్రకటించారు.

దీంతో ఇండిపెండెంట్‌గా కూడ పోటీకి సిద్దమని  మెట్టు గోవింద్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం నాడు మెట్టు గోవింద్ రెడ్డితో మంత్రి కాలువ శ్రీనివాసులు బేటీ అయ్యారు. కానీ గోవింద్ రెడ్డి మాత్రం తన పట్టును వీడలేదు.

మంత్రి కాలువ శ్రీనివాసులు మెట్టు గోవింద్ రెడ్డితో భేటీ అయి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే వైసీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుండి మెట్టు గోవింద్ రెడ్డి  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే చాన్స్ ఉందంటున్నారు.

సంబంధిత వార్తలు

కాల్వకు ఎసరు: సీటు కోసం జేసీ అల్లుడు పట్టు

 

click me!