బాబుకు కేసీఆర్ మార్క్ పంచ్ : 10న ఆంధ్రాకు వెళ్లే బస్సులు కట్..?

By Siva KodatiFirst Published Mar 26, 2019, 12:04 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్ర పన్నిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. ఆ మేరకు జగన్‌కు ఓపెన్‌గా మద్ధతు ప్రకటించకపోయినా తెర వెనుక సాయం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్ర పన్నిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. ఆ మేరకు జగన్‌కు ఓపెన్‌గా మద్ధతు ప్రకటించకపోయినా తెర వెనుక సాయం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో ఆస్తులున్న పలువురు ఆంధ్రా నేతలను బెదిరింపులకు గురిచేసి బలవంతంగా వైసీపీలో చేరేలా టీఆర్ఎస్ వర్గాలు పనిచేస్తున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

రూ.1000 కోట్ల నిధులను కేసీఆర్.. జగన్‌కు అందజేశారని వాటిని వైసీపీ శ్రేణులు జిల్లాల వారీగా పంచుకుంటున్నాయని మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈ సంగతి పక్కనబెడితే.. ఏప్రిల్ 11న ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లే సీమాంధ్రులకు కేసీఆర్ ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ఆన్‌లైన్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. 

హైదరాబాద్‌తో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్థిరపడ్డ సుమారు 50 లక్షల మంది ఆంధ్రులు పండక్కి సొంతూళ్లకు వెళ్లినట్లు ఓట్ల పండుగ కోసం సిద్ధమవుతున్నారు. రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో ఏప్రిల్ 10న సీట్లన్ని ఫుల్ అయిపోయాయి. 

తెలంగాణ నుంచి ఏపీకి ప్రతి రోజు 25 శాతం వరకు టికెట్లు రిజర్వ్ అవుతుంటాయి. కానీ పోలింగ్‌కు ముందు రోజు దాదాపు 70 శాతం మేర సీట్లు రిజర్వ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. 

అయితే ఏపీ ఓటర్లు తమ సొంత రాష్ట్రానికి వెళ్లి ఓటు వేయకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ఏప్రిల్ 10న తెలంగాణ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసిందని, దీనితో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్‌ను ఏపీ వైపు వెళ్లకుండా నియంత్రిస్తున్నారని చర్చ జరుగుతోంది. 

ఇందుకు సాకుగా తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికలు చూపిస్తున్నారని, తమ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున దూరప్రాంతాలకు ప్రజలను చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నందున ఏపీకి సర్వీసులు రద్దు చేస్తున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది.

ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఓటింగ్ శాతం పెరగకుండా కేసీఆర్ కుట్రలు పన్ని జగన్‌కు మేలు చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. 

click me!