వైఎస్ జగన్ కు అనుకూలంగా ఈసీ నడుస్తోంది: మాజీ ఎంపీ వీహెచ్

By Nagaraju penumalaFirst Published Apr 6, 2019, 4:52 PM IST
Highlights

వైఎస్ జగన్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే వారికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అందువల్లే వారిద్దరికి ఈసీ అనుకూలంగా నడుస్తోందని స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

వైఎస్ జగన్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే వారికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

అందువల్లే వారిద్దరికి ఈసీ అనుకూలంగా నడుస్తోందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించిన తీరులో చాలా వ్యత్యాసం ఉందన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులపై ఫిర్యాదులు చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. ఈసీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్డుపై ధర్నా చెయ్యాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగురోజుల్లో ఎన్నికలు పెట్టుకుని ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికల కమిషన్ ను చూడలేదని చెప్పుకొచ్చారు. 

ప్రధాని నరేంద్రమోదీ కనుసన్నుల్లోనే ఈసీ నడుస్తోందని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీకి ధైర్యం ఉంటే కేసీఆర్‌ కుటుంబంపై ఐటీ దాడులు చేయించాలని సవాల్ చేశారు వీహెచ్. 

click me!