శత్రువులు మిత్రులయ్యారు... ఎన్నికల్లో ఓడిపోయారు..ఉండవల్లి

By telugu teamFirst Published May 27, 2019, 1:45 PM IST
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా విచిత్రాలు జరిగాయని  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దశాబ్ధాల కాలం పాటు శత్రువులుగా ఉన్నవారంతా.... ఈ ఎన్నికల్లో మిత్రులుగా మారారని... కానీ ఓడిపోయారని ఆయన అన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా విచిత్రాలు జరిగాయని  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దశాబ్ధాల కాలం పాటు శత్రువులుగా ఉన్నవారంతా.... ఈ ఎన్నికల్లో మిత్రులుగా మారారని... కానీ ఓడిపోయారని ఆయన అన్నారు.

1946లో కాంగ్రెస్ గెలిచినప్పుడు రాష్ట్రంలోని రాజాలందరూ ఓడిపోయినట్లు ఈ ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర రాజులు అందరూ ఓడిపోయారని గుర్తు చేశారు.ఉత్తరాంధ్రలో విజయనగరం రాజా, బొబ్బిలి రాజా, కురుపాం రాజా ముగ్గురూ కలిసిపోయారు..కానీ ముగ్గురూ ఓడిపోయారని ఆయన అన్నారు.

తాను  రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కర్నూలులో కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వం ఉందని అలాంటి వాళ్లను కూడాఈ ఎన్నికల్లో కలిశారని కానీ వాళ్లూ ఓడిపోయారని చెప్పారు.. అలాగే కడపలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలనూ కలిపేసి ఒకరిని ఎమ్మెల్యేగా, ఒకరిని ఎంపీగా నిలబెట్టారని.. వాళ్లిద్దరూ కూడా ఓడిపోయారని చెప్పారు. 

ఇక విజయవాడలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ కుటుంబాలు కూడా కలిసిపోయాయని.. అయినా ఓడిపోయారని చెప్పారు. ‘ఆ ఊళ్లో ఆ ఇద్దరూ కలిస్తే ఇక తిరుగులేదురా’ అనే నమ్మకాన్ని ప్రజలు తప్పని నిరూపించారని చెప్పారు. బలం నాయకుల్లో లేదు.. ప్రజల్లోనే ఉందనే మంచి మెసేజ్ ఇచ్చారని ఉండవల్లి పేర్కొన్నారు.

click me!