ప్రజలు నమ్మకంతోనే జగన్ ని గెలిపించారు... ఉండవల్లి

Published : May 27, 2019, 12:43 PM IST
ప్రజలు నమ్మకంతోనే జగన్ ని గెలిపించారు... ఉండవల్లి

సారాంశం

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేసి జగన్ ని గెలిపించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేసి జగన్ ని గెలిపించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి... జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అవినీతిరహిత పాలన అందిస్తామని జగన్‌ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విప్లవాత్మక మార్పులకు జగన్‌ వ్యాఖ్యలు నాంది అని పేర్కొన్నారు.
 
ఇసుక మాఫియాను మొదట అరికట్టాలన్నారు. ప్రభుత్వసలహాదారుగా అజయ్‌కల్లాం నియామకం హర్షనీయమని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. చంద్రబాబుపై నెగిటివ్‌ ఓటుతో జగన్‌ అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలకు ఏదో చేస్తాడన్న నమ్మకంతో జగన్‌కు ఓటేశారన్నారు. జగన్‌ 50శాతం ఓట్లతో గెలవడం గొప్ప విషయమని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు