మంత్రి నారాయణ నామినేషన్‌పై క్లారిటీ: పీలేరు వైసీపీ అభ్యర్ధి నామినేషన్‌పై అభ్యంతరాలు

By narsimha lodeFirst Published Mar 26, 2019, 3:13 PM IST
Highlights

చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చింతల రామచంద్రారెడ్డి నామినేషన్‌పై ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నామినేషన్ పత్రాలతో పాటు  నో డ్యూస్ సర్టిఫికెట్ జతపర్చలేదు.


అమరావతి: చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చింతల రామచంద్రారెడ్డి నామినేషన్‌పై ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నామినేషన్ పత్రాలతో పాటు  నో డ్యూస్ సర్టిఫికెట్ జతపర్చలేదు.

ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముందు ప్రస్తావించాయి. ఈ విషయమై ఎన్నికల అధికారులు  పరిశీలిస్తున్నారు. మరో వైపు నెల్లూరు సిటీ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న మంత్రి  నారాయణ నామినేషన్‌పై  కూడ ప్రత్యర్థులు అభ్యంతరం తెలిపారు. 

ఈ నామినేషన్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకొంటారోననే  ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇదిలా ఉంటే  ప్రత్యర్థుల అభ్యంతరంపై తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వివరణ ఇచ్చినట్టుగా వైసీపీ పీలేరు అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి ప్రకటించారు.. 

తన వివరణతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందారని ఆయన తెలిపారు. పీలేరు స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

నామినేషన్‌తో జతపర్చిన అఫిడవిట‌్‌లో   తప్పులున్నాయని ప్రత్యర్థులు అభ్యంతం చెప్పారు. అయితే ఈ విషయమై రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను పరిశీలించారు. ఎట్టకేలకు నారాయణ నామినేషన్ సరైందేనని తేల్చారు.

click me!