మద్యం, నగదు పట్టివేత, నిబంధనలు అమలు చేస్తాం: ద్వివేదీ

By Nagaraju penumalaFirst Published Apr 9, 2019, 7:03 PM IST
Highlights

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రూ.118 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశాలో రూ.2 కోట్లు, తెలంగాణలో రూ.45 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు.

అమరావతి: రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. 

పోలింగ్ బూత్ లో ఏజెంట్లు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రూ.118 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

ఒడిశాలో రూ.2 కోట్లు, తెలంగాణలో రూ.45 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. మరోవైపు 24.15 కోట్లు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. 

ఇకపోతే రూ.200 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలతోపాటు శారీస్, మెుబైల్ ఫోన్స్ ను పట్టుకున్నట్లు తెలిపారు. గుజరాత్, తమిళనాడు తర్వాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్దమెుత్తంలో ఆభరణాలు పట్టుకున్నట్లు తెలిపారు. 

ఏపీలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. సీవిజిల్ ద్వారా 5,600 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో 2,000కు పైగా ఫాల్స్ కేసులు ఉన్నట్లు తెలిపారు. రవాణాకు సంబంధించి 7,300 బస్సులు వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. 

మెుత్తానికి 2014 ఎన్నికల్లో కంటే అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. గతంలో 78 శాతం పోలింగ్ నమోదైందని ఈసారి అది మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు సిఈవో గోపాలకృష్ణద్వివేది స్పష్టం చేశారు. 

 

click me!