ప్రధాని మోదీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

Published : May 19, 2019, 04:13 PM IST
ప్రధాని మోదీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

సారాంశం

ప్రధాని నరేంద్రమోదీపై... ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీపై... ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ప్రచారం ముగిసిన తర్వాత మోదీ కేదార్‌నాథ్, బద్రీనాదథ్ పర్యటనలకు వెళ్లారని, అది కచ్చితంగా ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన పేర్కొన్నారు. మోదీ ఆధ్యాత్మకి పర్యటనను మీడియా నిరంతరం ప్రసారం చేయడంతో పలువురు ఓటర్లను అది ప్రభావితం చేస్తుందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు