
ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఇంకా దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న చాలా ప్రాంతాల్లో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో ఈ రోజు ప్రతీకారదాడులు జరుగుతున్నాయి.
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గురువారం తమ వర్గం వారిపై దాడులకు పాల్పడ్డారన్న కారణంతో శుక్రవారం ఉదయం టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గ్రామంలో మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో నలుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓ పోలింగ్ కేంద్రంలో అదనంగా 50 ఓట్లు పోల్ కావడంపై నిన్న వివాదం చెలరేగింది.