గెలుపు మాదే:ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలతో ఆత్మరక్షణలో బాబు

By narsimha lodeFirst Published May 20, 2019, 1:35 PM IST
Highlights

 నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే విజయం సాధిస్తామని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు. గెలుపు విషయంలో చిన్న అనుమానం కూడ లేదని ఆయన చెప్పారు.మరోసారి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

అమరావతి: నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే విజయం సాధిస్తామని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు. గెలుపు విషయంలో చిన్న అనుమానం కూడ లేదని ఆయన చెప్పారు.మరోసారి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

సోమవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజున తాను ఒక్క పిలుపు ఇస్తే లక్షలాది మంది వచ్చి ఓటు చేశారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని బాబు ధీమాను వ్యక్తం చేశారు.

1983 నుండి సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.కొన్ని మీడియా సంస్థలు కూడ సర్వేలు నిర్వహిస్తాయన్నారు.ఐదేళ్ల తమ పాలనపై ఎప్పటికప్పుడు సర్వేలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు.తమ గెలుపు విషయంలో ఎవరికీ కూడ  అనుమానం లేదని బాబు అభిప్రాయపడ్డారు. తాను పిలుపిస్తే ఆరు గంటల పాటు క్యూ లైన్లలో నిలబడి ఓటు చేశారని బాబు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలు  అర్ధాంతరంగా నిలిచిపోకుండా ఉండేందుకు వీలుగా ప్రజలు టీడీపీకి అండగా నిలిచారని  ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత  చంద్రబాబునాయుడు ఆత్మరక్షణలో పడినట్టు కన్పిస్తోంది. సోమవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి  గెలుపు  తమ పార్టీదేనని ఆయన ప్రకటించారు. 
 

click me!