నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం

By Nagaraju penumalaFirst Published Mar 13, 2019, 5:20 PM IST
Highlights


నేరస్థులకు గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్ అంటూ చెప్పుకొచ్చారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, నేరాలు చెయ్యడంలో మాస్టర్ చేసిన వారే వైఎస్ జగన్ చుట్టూ ఉంటారని ఆరోపించారు. నేరాలు ఎలా చెయ్యాలి, ఘోరాలు ఎలా చెయ్యాలి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై జగన్ దృష్టి అంటూ చెప్పుకొచ్చారు. 
 

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ లాంటి నేరస్థుడు దేశచరిత్రలో ఎవరూ లేరన్నారు. తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్ లాంటి నేరస్థుడిని చూడలేదన్నారు. 

వైఎస్ జగన్ దిగజాడరుడు రాజకీయవేత్త అంటూ తిట్టిపోశారు. షెల్ కంపెనీలు, వ్యాపారాలు, మనీ ల్యాండరింగ్ వంటి నేరాలకు పాల్పడటంతో పాటు సరిపోనట్లు తాజాగా ఎన్నికల కుట్రకు తెరలేపారంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఓట్లు తొలగించేందుకు వైఎస్ జగన్ కుట్రపన్నుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

నేరస్థులకు గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్ అంటూ చెప్పుకొచ్చారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, నేరాలు చెయ్యడంలో మాస్టర్ చేసిన వారే వైఎస్ జగన్ చుట్టూ ఉంటారని ఆరోపించారు. నేరాలు ఎలా చెయ్యాలి, ఘోరాలు ఎలా చెయ్యాలి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై జగన్ దృష్టి అంటూ చెప్పుకొచ్చారు. 

సమాజానికి మంచి చేసేందుకు తాను ఇన్నోవేషన్ తో ముందుకు వెళ్తుంటే వైఎస్ జగన్ నేరంలో ఇన్నోవేషన్ తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈడీ డైరెర్టర్ కల్నల్ సింగ్ 30-05-2017లో లేఖ రాశారని అందులో జగన్ ఆర్థిక నేరాలు బట్టబయలు చేశారని తెలిపారు. 

అయితే మోదీ ఆ లేఖను తొక్కిపెట్టారంటూ చెప్పుకొచ్చారు. హిందూజా కంపెనీకి సంబంంధించి 11 ఎకరాల భూమి విషయంలో జగన్ నేరాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. 

తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నాలెడ్జ్ పార్క్ కోసం 2005లో కూకట్ పల్లిలో 100 ఎకరాలు భూములు కేటాయించారని ఆరోపించారు. హిందూజా కంపెనీకి ఇచ్చిన 100 ఎకరాలకు బదులు 11 ఎకరాలు వైఎస్ జగన్ కంపెనీ లాక్కుందని తెలిపారు. 

యాగా అసోషియేట్స్ కంపెనీ 11 ఎకరాల 10 సెంట్ల భూమిని జగన్ స్వాధీనం చేసుకుని ఆ భూమిని దోచుకున్నారని ఆరోపించారు. హిందూజా కంపెనీకి చెందిన భూములను లాక్కుని ఆ కంపెనీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చారంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. శ్యాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన కంపెనీని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని తెలిపారు. 500 కోట్లు అక్రమంగా జగన్ దోచుకున్నారంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు. 
 

click me!