చంద్రబాబు ప్లాన్: ఒంగోలు పార్లమెంట్ కు మంత్రి శిద్ధా, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు

By Nagaraju penumalaFirst Published Mar 13, 2019, 4:39 PM IST
Highlights

మెుత్తానికి చంద్రబాబు నాయుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా పార్లమెంట్ కు శిద్ధా రాఘవరావును పంపించి ఉగ్ర నరసింహారెడ్డి, కదిరి బాబూరావుల మధ్య నెలకొన్న విబేధాలుకు చెక్ పెట్టడంతోపాటు దర్శి కేండిడేట్ ను కూడా ఎట్ ఏ టైమ్ ప్రకటించారు చంద్రబాబు. 

అమరావతి: ఉరుమి ఉరుమి మంగళం మీద పడినట్లు మంత్రి శిద్ధా రాఘరావుపై వచ్చి పడింది ఒంగోలు పార్లమెంట్ సీటు. ఒంగోలు పార్లమెంట్ కు సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో ఆ సీటు మంత్రి శిద్దా రాఘవరావుపై పడింది. 

ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అనుకున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి  పార్టీ వీడతారన్న ప్రచారంతో ముందే అప్రమత్తమైన చంద్రబాబునాయుడు ఒంగోలు పార్లమెంట్ సీటుపై చర్చించారు. ఎవరిని ఆలోచించినా ధీటైన అభ్యర్థి కాదని నిర్ధారణకు రాకపోవడంతో చంద్రబాబు దృష్టి మంత్రి శిద్ధా రాఘవ రావుపై పడింది. 

దీంతో మంగళవారం మంత్రి శిద్ధా రాఘవరావుకు కబురుపంపారు. సాయంత్రం ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో మంత్రి శిద్ధా రాఘవరావు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యాలంటూ చంద్రబాబు నాయుడు మంత్రి శిద్ధా రాఘవరావును ఆదేశించారు. 

తనకు దర్శి నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని ఉందని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గం నేతలు, అభిమానులు, కార్యకర్తలు దర్శి నుంచే పోటీ చెయ్యమంటున్నారని చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. 

అయితే బుధవారం మరోసారి కలవాలంటూ చెప్పి పంపించేశారు. మెుత్తానికి చంద్రబాబు నాయుడు ఒత్తిడితో మంత్రి శిద్ధా రాఘవరావు దిగిరాకతప్పలేదు. ఎట్టకేలకు ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు ఊపిరి పీల్చుకున్నారు. 

బుధవారం చంద్రబాబు నాయుడును కలిసిన మంత్రి శిద్ధా రాఘవరావు ఎట్టకేలకు తాను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. శిద్ధా రాఘవరావు సుముఖత వ్యక్తం చెయ్యడంతో వెంటనే దర్శి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు చంద్రబాబు. 

ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డిని దర్శి అభ్యర్థిగా ప్రకటించారు. శిద్ధా రాఘవరావు అటు ఒంగోలు పార్లమెంట్ కు వెళ్లడంతో చంద్రబాబు నాయుడు రెండు సమస్యలను క్లియర్ చేశారు. కనిగిరి టికెట్ విషయంలో ఉగ్ర నరసింహారెడ్డి, కదిరిబాబూరావుకు మధ్య ఉన్న విబేధాలకు చెక్ పెట్టారు. 

కనిగిరి సీటు విషయంపై తర్జన భర్జన పడుతున్న సమయంలో దర్శి నియోజకవర్గాన్ని ఉగ్రనరసింహారెడ్డికి కేటాయించారు. అనంతరం బయటకు వచ్చిన శిద్ధా రాఘవరావును అభిమానులు కార్యకర్తలు అడ్డుకున్నారు. 

ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే దర్శి నియోజకవర్గం టీడీపీ ఓడిపోతుందని స్పష్టం చేశారు. మెుత్తానికి చంద్రబాబు నాయుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా పార్లమెంట్ కు శిద్ధా రాఘవరావును పంపించి ఉగ్ర నరసింహారెడ్డి, కదిరి బాబూరావుల మధ్య నెలకొన్న విబేధాలుకు చెక్ పెట్టడంతోపాటు దర్శి కేండిడేట్ ను కూడా ఎట్ ఏ టైమ్ ప్రకటించారు చంద్రబాబు. 

click me!