పంతం పట్టి సాధించుకున్న జేసీ

By ramya NFirst Published Mar 19, 2019, 10:44 AM IST
Highlights

ఎన్నికల షెడ్యుల్ ఖరారు అయ్యింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. 

ఎన్నికల షెడ్యుల్ ఖరారు అయ్యింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. కాగా.. అనంతపురం జిల్లా టికెట్ల కేటాయింపులో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం తన పంతం నెగ్గించుకున్నారనే వాదనలు వినపడుతున్నాయి. 

తన కుమారుడికి టికెట్ దక్కించుకోవడంతోపాటు.. తన వారికి కూడా టికెట్లు ఇప్పించుకున్నాడు. కుమారుడికి కాకుండా.. మరో నలుగురికి టికెట్లు దక్కించుకునేలా జేసీ ప్లాన్ వేయగా.. వారిలో ఇద్దిరి విషయంలో చంద్రబాబు సముఖత వ్యక్తం  చేశారు. దీంతో.. ఇద్దరికి టికెట్లు దక్కాయి.

టీడీపీ అధిష్ఠానంపై ఎంపీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు అభ్యర్థుల మార్పుపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహించగా అందులో వచ్చిన ఫలితాలనూ, సీఎం చంద్రబాబు వద్ద ఉన్న సర్వేలనూ బేరీజు వేసుకుని చివరగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. అనంతపురం స్థానానికి అమిలినేని సురేంద్రబాబు పేరు ఎంపీ జేసీ సూచించినా ఆయన అక్కడి నుంచి పోటీచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

 గుంతకల్లు నుంచి మధుసూదన్‌ గుప్తా పేరు సూచించినా అక్కడ బీసీలకే అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. శింగనమలలో ఎంపీ జేసీ సూచించిన బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు పేర్లను సీఎం ఖరారు చేశారు. దీంతో.. నలుగురిలో ఇద్దరికి టికెట్లు ఇప్పించి.. తన పంతం నెగ్గించుకున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

click me!