రాజకీయాలకు బుడ్డా గుడ్‌బై: కొత్త అభ్యర్ధి కోసం చంద్రబాబు అన్వేషణ

By narsimha lodeFirst Published Mar 19, 2019, 10:21 AM IST
Highlights

కర్నూల్ జిల్లా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్టు దక్కినా కూడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుండి తప్పుకొన్నారు. దీంతో మరో నలుగురు పేర్లను చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.
 


శ్రీశైలం: కర్నూల్ జిల్లా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్టు దక్కినా కూడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుండి తప్పుకొన్నారు. దీంతో మరో నలుగురు పేర్లను చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా శ్రీశైలం నుండి పోటీ చేసిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు.టీడీపీ  చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో శ్రీశైలం నుండి బుడ్డా రాజశేఖర్ రెడ్డి టిక్కెట్టు దక్కించుకొన్నారు. 

గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి బరిలోకి  దిగుతున్నారు.

టీడీపీ టిక్కెట్టు దక్కినా కూడ బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేయబోనని ప్రకటించారు. రాజకీయాలకు తాను గుడ్‌బై చెబుతున్నట్టుగా సోమవారం నాడు ప్రకటించారు. దీంతో ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహిస్తున్నారు.

బుడ్డా శేషిరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డితో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్లను చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. 

శ్రీశైలం నుండి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయనే విషయమై చంద్రబాబునాయుడు ఆరా తీస్తున్నారు.
 

click me!