సీఎం రమేశ్ ఇంట్లో పోలీసుల దాడులు ఓ డ్రామా: జీవీఎల్

Siva Kodati |  
Published : Apr 07, 2019, 12:56 PM IST
సీఎం రమేశ్ ఇంట్లో పోలీసుల దాడులు ఓ డ్రామా: జీవీఎల్

సారాంశం

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... సీఎం రమేశ్ ఇంటిపై పోలీసుల దాడులు బూటకమన్నారు

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... సీఎం రమేశ్ ఇంటిపై పోలీసుల దాడులు బూటకమన్నారు..

ఆయన కావాలనే తన ఇంటిపై దాడులు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఓ ఆంగ్ల దినపత్రిక కథనం రాసిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా డ్రామాలు ఆడిన సీఎం రమేశ్ జనానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో సానుభూతి కోసమే టీడీపీ నేతలు.. పోలీసులు దాడులు అంటూ డ్రామాలు ఆడుతున్నారంటూ నరసింహారావు ఆరోపించారు. డ్రామాలు ఆడటం రమేశ్‌కు.. టీడీపీ నేతలకు కొత్తేం కాదని... పోలీసుల దాడులపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు