బాలకృష్ణకి పిచ్చి ముదిరింది, చంద్రబాబూ! కాస్త చూడండి: జీవీఎల్

By Nagaraju penumalaFirst Published Apr 5, 2019, 8:05 PM IST
Highlights

గతంలో తనకు మెంటల్ అని బాలకృష్ణ సర్టిఫికెట్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పిచ్చి ఇప్పుడు మరింద ముదురుతోందని అన్నారు. మీడియాపైనా, ప్రజలపైనా, టీడీపీ కార్యకర్తలపై బండబూతులతో బాలకృష్ణ విరుచుకుపడుతున్నారని విమర్శించారు. 
 

ఢిల్లీ: హిందుపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు పిచ్చి మరింత ముదిరిందని వ్యాఖ్యానించారు. 

గతంలో తనకు మెంటల్ అని బాలకృష్ణ సర్టిఫికెట్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పిచ్చి ఇప్పుడు మరింద ముదురుతోందని అన్నారు. మీడియాపైనా, ప్రజలపైనా, టీడీపీ కార్యకర్తలపై బండబూతులతో బాలకృష్ణ విరుచుకుపడుతున్నారని విమర్శించారు. 

మతిస్థిమితం లేని బాలయ్యను చంద్రబాబు కంట్రోల్ చెయ్యాలని సూచించారు. రైతు రుణమాఫీ ఇంతవరకు పూర్తిగా చంద్రబాబు చేయలేదని, అన్నదాత సుఖీభవ పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టిన స్టిక్కర్ బాబుగా మారారని ఎద్దేవా చేశారు. 

అవినీతి మా జన్మ హక్కు అన్నట్లుగా టీడీపీ తయారైందని విమర్శించారు. టీడీపీ నాయకులు దొంగతనం చేసినట్లు చంద్రబాబు వాంగ్మూలం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలోనే ఐటీ దాడులు జరుగుతాయని తెలిపారు. 

ప్రభుత్వం గానీ, సొంతంగా ఆదాయపన్ను శాఖ గానీ ఈ దాడులు చేయదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జరిగే సోదాలు కావన్నారు. తన నివాసంలో పోలీసులు సోదాలు చేశారని చెప్తున్న సీఎం రమేష్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తారని తెలుసుకోవాలని సూచించారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తప్పుడు మాటలు మానుకోవాలని సూచించారు. ప్రతి దానికి నరేంద్ర మోదీని విమర్శించడం సరైంది కాదన్నారు. 

చంద్రబాబుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వంద కోట్ల రూపాయల జరిమానా విధించడం ఒక ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. 

టీడీపీ నాయకులే  ఆ వంద కోట్ల రూపాయల జరిమానా కట్టాలని స్పష్టం చేశారు. ప్రజాధనం నుంచి రూ.100 కోట్లు చెల్లిస్తే సహించేది లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సారధి చంద్రబాబుపై వ్యక్తిగత జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.  
 

click me!