చంద్రబాబును కలిసిన బాలకృష్ణ: తాజా పరిణామాలపై చర్చ

By Nagaraju penumalaFirst Published May 24, 2019, 5:54 PM IST
Highlights


ఎన్నికల ఫలితాలు, పోలింగ్ సరళిపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే కౌంటింగ్ విధానంపై కూడా చర్చించారు. ఇకపోతే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి ఇక్బాల్ పై సుమారు 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

అమరావతి: ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

ఎన్నికల ఫలితాలు, పోలింగ్ సరళిపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే కౌంటింగ్ విధానంపై కూడా చర్చించారు. ఇకపోతే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. 

తన సమీప ప్రత్యర్థి ఇక్బాల్ పై సుమారు 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి కె.చంద్రమౌళిపై 30వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అయితే బాలకృష్ణ అల్లుళ్లు ఇద్దరు ఓటమి పాలయ్యారు. 

పెద్దల్లుడు మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇకపోతే చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  
 

click me!