
అమరావతి: నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని స్పష్టం చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఇది ఒక చరిత్ర అంటూ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు తొమ్మిది సంవత్సరాలపాటు వైయస్ జగన్ అహర్నిశలు శ్రమించారని అందుకు తగ్గ ఫలితం వచ్చిందన్నారు. తనను ఓడించేందుకు మంత్రి నారాయణ డబ్బులు కుమ్మరించారని అయినా ప్రజలు తనకే పట్టం కట్టారన్నారు.
రూ.100 కోట్ల మేర డబ్బులు కుమ్మరించి గెలుద్దామని మంత్రి నారాయణ ప్రయత్నించారని కానీ ప్రజలు మాత్రం తనవైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. డబ్బు నామమాత్రమేనని, ప్రజాభిమానమే ఎప్పుడూ గెలుస్తుందని ఈ ఎన్నికలు నిరూపించాయని స్పష్టం చేశారు. తాను ఏదైతే హామీలు ఇచ్చినా అన్నిహామీలను తప్పకుండా అమలు చేసి తీరతానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.