ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే..!!

By Siva KodatiFirst Published Mar 22, 2019, 1:32 PM IST
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మేనిఫెస్టోను ప్రకటించారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మేనిఫెస్టోను ప్రకటించారు.

అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు రఘువీరా తెలిపారు. పుస్తకాలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, వందలు, వేల హామీలు ఇవ్వదని వెల్లడించారు. 

* రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజ్‌అమలు. ఈ జాబితాలోకి ప్రకాశం జిల్లాకు చోటు

* విశాఖ రైల్వే జోన్ వెనువెంటనే అమల్లోకి తీసుకొస్తాం

* దుగ్గరాజపట్నం ఉక్కు కర్మాగారం, 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధులు

* విభజన చట్టంలోని హామీల అమలు

* రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు

* స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా రైతులకు గిట్టుబాటు ధర

* రూ.5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

* విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు

* ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం రూపకల్పన

* రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని జబ్బులు, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం

* కార్పోరేట్ విద్యాసంస్థల నియంత్రణ

* చేనేత కార్మికులకు పూర్తి రుణమాఫీ

* చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ మినహాయింపు

* ఉద్యోగుల కంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం

* జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు 

* ప్రతి పేద మహిళకు సంవత్సరానికి ఉచితంగా నాలుగు గ్యాస్ సీలిండర్లు

* 50 నుంచి 60 సంవత్సరాల వయసున్న వారికి రూ.2000 పెన్షన్, 60 నుంచి 70 ఏళ్లున్న వారికి రూ. 2,500, 70 ఏళ్లు దాటిని వారికి రూ.3000 పెన్షన్

* వికలాంగులకు రూ.3000 పెన్షన్, ఒంటరి మహిళలకు సైతం పెన్షన్

* పేదల సంక్షేమ పథకాలకు సంబంధించి బయో మెట్రిక్ విధానం రద్దు

* దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తాం

* రజకులు, వడ్డెర్లు ఎస్సీ జాబితాలోకి, వాల్మీకులు, మత్స్యకారులు ఎస్టీ జాబితాలోకి చేరుస్తాం

* ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ చట్టం చేసిన విధంగా బీసీలు, మైనారిటీలకు ఉప ప్రణాళిక

* ప్రతి పేదవాడికి ఆదాయ భరోసా

* ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు

* అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ భరోసా

click me!