ఎవరెన్ని కుట్రలు చేసినా...గెలిచేది టీడీపీయే: బాలకృష్ణ

Siva Kodati |  
Published : Mar 22, 2019, 01:07 PM IST
ఎవరెన్ని కుట్రలు చేసినా...గెలిచేది టీడీపీయే: బాలకృష్ణ

సారాంశం

ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనన్నారు సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ.  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బాలయ్య శుక్రవారం నామినేషన్ వేశారు

ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనన్నారు సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ.  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బాలయ్య శుక్రవారం నామినేషన్ వేశారు.

సెంటిమెంట్ ప్రకారం హిందూపురంలోని సూగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి బాలకృష్ణ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిందని, అలాంటి పార్టీపై కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని బాలయ్య జోస్యం చెప్పారు.

హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందని, రానున్న రోజుల్లో మరో బెంగళూరుగా తీర్చిదిద్దుతానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు