పోలవరంపై ప్రధాని వ్యాఖ్యలు: మంత్రి దేవినేని ఫైర్

By Siva KodatiFirst Published Apr 2, 2019, 9:35 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు మంత్రి దేవినేని ఉమా. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... పోలవరంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించారు

ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు మంత్రి దేవినేని ఉమా. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... పోలవరంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించారు. 1941 నాటి పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మాణంపై ఎంతో మంది ఆలోచన చేసినా కార్యరూపం దాల్చని పోలవరాన్ని చంద్రబాబు పూర్తి చేస్తున్నారని దేవినేని తెలిపారు.

జూలై నాటికి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అప్పర్ కాపర్ డ్యాం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని ఒక్కసారి కూడా ప్రధాని సందర్శించలేదని.. దీనిని బట్టి తెలుగుజాతిపై ఆయన ప్రేమ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

పోలవరం నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ప్రధాని ఆరోపిస్తున్నారని.. కానీ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రాజెక్ట్‌ను ప్రశంసిస్తున్నాయని దేవినేని గుర్తు చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి తనను ఢిల్లీకి పిలిపించి అవార్డు ఇచ్చారన్నారు.

32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను నిరంతరాయంగా నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పోలవరానికి చోటు దక్కిందన్నారు. నితిన్ గడ్కరీ రెండు సార్లు పోలవరాన్ని సందర్శించి పనులను ప్రశంసించారని దేవినేని గుర్తు చేశారు.

కేంద్రం నుంచి రూ.4, 483 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, టెక్నికల్ అడ్వజరీ కమిటీ నుంచి క్లియరెన్స్ రావాలని ఉన్నందున వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తాము గడ్కరీని కోరామన్నారు.  

click me!