శ్రీకాకుళం అభ్యర్థులను ఫైనల్ చేసిన చంద్రబాబు: బరిలో రామ్మెహన్ నాయుడు, గౌతు శిరీష

By Nagaraju penumalaFirst Published Mar 8, 2019, 8:57 PM IST
Highlights

సిట్టింగ్ లకు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మళ్లీ అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ల విషయాలకు వస్తే శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవినే ప్రకటించారు. అటు ఆముదాలవలస టికెట్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కే కేటాయించారు.

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల కసరత్తుపై స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. 

ఆ సమీక్షలో దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. అయితే సిట్టింగ్ లకు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మళ్లీ అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ల విషయాలకు వస్తే శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవినే ప్రకటించారు. 

అటు ఆముదాలవలస టికెట్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కే కేటాయించారు. ఇచ్చాపురం నుంచి బెందళం అశోక్, టెక్కలి నుంచి మంత్రి అచ్చెన్నాయుడు, పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, నరసన్నపేట నియోజకవర్గం నుంచి బొగ్గు లక్ష్మణరావులు పోటీ చెయ్యనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

అభ్యర్థుల వివరాలు
1. శ్రీకాకుళం పార్లమెంట్ - కె.రామ్మోహన్ నాయుడు

అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు
1. శ్రీకాకుళం             - గుండా లక్ష్మీదేవి
2. ఆముదాలవలస   - కూన రవికుమార్
3. ఇచ్చాపురం          -  బెందళం అశోక్
4.టెక్కలి                 -  అచ్చెన్నాయుడు
5. పలాస                 -   గౌతు శిరీష
6. నరసన్నపేట       -   బొగ్గు లక్ష్మణరావు
 

click me!