పట్టపగలు మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Mar 8, 2019, 8:06 PM IST
Highlights

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తోందని తెలిపారు. స్త్రీ మూర్తులు స్వశక్తితో ముందుకు వెళ్లేలా జనసేన పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

విజయవాడ: మహాత్మగాంధీ కన్న కలలు నేడు తారుమారైపోయాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రస్తుతం మహిళలు పట్టపగలు కూడా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని అలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. 

ప్రస్తుత రోజుల్లో మహిళలు రోడ్డుపై వెళ్తుంటే అల్లరి మూకల వేధింపులు దారుణంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తనకు స్త్రీలు అంటే ఎంతో గౌరవమని చెప్పుకొచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులను చూసే తాను రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. అందుకే తాను వీరమహిళ విభాగాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. 

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తోందని తెలిపారు. 

స్త్రీ మూర్తులు స్వశక్తితో ముందుకు వెళ్లేలా జనసేన పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీలో ప్రతీ కమిటీలో 33 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తానని చెప్పుకొచ్చారు. మహిళలకు, విద్యార్థినులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, వారికి బంగారు భవిష్యత్ అందజేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  
 

click me!