ప్రశ్నించడానికొచ్చి... ప్రశ్నగా మిగిలిపోయారు: పవన్‌పై సోము ఫైర్

Siva Kodati |  
Published : Apr 05, 2019, 01:19 PM IST
ప్రశ్నించడానికొచ్చి... ప్రశ్నగా మిగిలిపోయారు: పవన్‌పై సోము ఫైర్

సారాంశం

అబద్ధాలు ఆడటంలో దేశంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు

అబద్ధాలు ఆడటంలో దేశంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. ఆరెస్సెస్ పెద్దలను కలవడానికి వైఎస్ జగన్ కలవడానికి ప్రయత్నించారని చంద్రబాబు అంటున్నారని.. కానీ అది వాస్తవం కాదని ముఖ్యమంత్రే ఆరెస్సెస్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారని వీర్రాజు స్పష్టం చేశారు.  

చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రని, స్టిక్కర్ ముఖ్యమంత్రని, అవినీతి ముఖ్యమంత్రని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తానని వచ్చిన నాయకుడు చివరకు ప్రశ్నగా మిగిలిపోయాడని పవన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

కొమ్ముకాసే వ్యక్తిగా పవన్ మిగిలిపోయారని వీర్రాజు ఎద్దేవా చేశారు. మంచి ఉద్దేశ్యంతో పవన్‌ను పార్టీలోకి ఆహ్వానించామని పథకం ప్రకారం టీడీపీపై పవన్ విమర్శలు చేశారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో డబుల్ గేమ్ ఆడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు