మంత్రి పదవిపై జగన్ దే తుదినిర్ణయం : నూతన ఎమ్మెల్యే ఆళ్లనాని

Published : May 24, 2019, 05:21 PM IST
మంత్రి పదవిపై జగన్ దే తుదినిర్ణయం : నూతన ఎమ్మెల్యే ఆళ్లనాని

సారాంశం

తనకు మంత్రి పదవి వస్తుందంటూ వస్తున్న వార్తలపై నూతన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని స్పందించారు. మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. 

పశ్చిమగోదావరి: తనకు మంత్రి పదవి వస్తుందంటూ వస్తున్న వార్తలపై నూతన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని స్పందించారు. మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. 

వైయస్ జగన్ నిర్ణయానికే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు ఆళ్ల నాని. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ఏమాత్రం కృషి చేయలేదన్నారు. 

తుందుర్రు ఆక్వా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు కొమ్ముకాశారని ఆరోపించారు. కొల్లేరు ప్రజలకు న్యాయం కూడా చేయలేదని ఆళ్లనాని ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు