చంద్రబాబు ఓటమి 23వ తేదీనే: చేర్చుకొంది 23 మందిని, గెల్చుకొందీ 23 మందినే

By narsimha lodeFirst Published May 24, 2019, 4:08 PM IST
Highlights

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  2014లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు. 2019 ఎన్నికల్లో  టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.

అమరావతి: అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  2014లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు. 2019 ఎన్నికల్లో  టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీకి 103 , వైసీపీకి 66 , బీజేపీకి 4, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆ తర్వాత త చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. 

ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

ఇదే విషయమై అసెంబ్లీకి కూడ వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకూడదని నిర్ణయం కూడ తీసుకొన్నారు.ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ఎన్నికల ఫలితాలు కూడ మే 23వ తేదీనే వెలువడ్డాయి.


 

click me!