లక్ష్మీ పార్వతి ఓ విషపు చుక్క.. దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు

Published : Mar 26, 2019, 03:23 PM IST
లక్ష్మీ పార్వతి ఓ విషపు చుక్క.. దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నటి, టీడీపీ మహిళా నేత దివ్య వాణి మండిపడ్డారు. 

వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నటి, టీడీపీ మహిళా నేత దివ్య వాణి మండిపడ్డారు. ఈ నెలాఖరున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విడుదలను అడ్డుుకోవడానికి టీడీపీ నేతల శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

దీనిలో భాగంగానే మంగళవారం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై టీడీపీ నేతలు, నటి దివ్యవాణి, దేవీబాబు, బ్రహ్మంచౌదరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ కోరిన డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. 

ఈ సందర్భంగా దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం వెనుకున్నది కోడికత్తి పార్టీనే అని విమర్శించారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జీవితంలో లక్ష్మీపార్వతి విషపుచుక్కని దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు