పంచ్ డైలాగ్

By telugu teamFirst Published Mar 11, 2019, 11:27 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ చంద్రబాబు పంచ్ డైలాగ్ విసిరారు.

కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను వంద రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తా: చంద్రబాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని తమను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. ఎపి ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. దానికి ప్రతిస్పందనగా చంద్రబాబు ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తాను వంద రిటర్న్ గఫ్ట్ లు ఇస్తానని అన్నారు. తన వద్ద పనిచేసిన కేసిఆర్ కే అన్ని తెలివితేటలు ఉంటే తనకు ఎన్ని తెలివితేటలు ఉండాలని ప్రశ్నించారు. 

click me!