టీడీపి పదవులకు పలమనేరు కీలక నేత రాజీనామా

Published : Mar 07, 2019, 05:10 PM IST
టీడీపి పదవులకు పలమనేరు కీలక నేత రాజీనామా

సారాంశం

తనకు పలమనేరు టికెట్ ఇవ్వాలని బోస్ బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. అయితే, అక్కడి నుంచి సానుకూలత రాకపోవడంతో రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పలమనేరు: పార్టీ పదవులకు చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ నియోజకవర్గం నేత సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. పలమనేరు శాసనసభ నియోజకవర్గం సీటును ఆశించి ఆయన భంగపడ్డారు. దాంతో ఆయన టీడీపికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

తనకు పలమనేరు టికెట్ ఇవ్వాలని బోస్ బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. అయితే, అక్కడి నుంచి సానుకూలత రాకపోవడంతో రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పలమనేరు శాసనసభ నియోజకవర్గం టికెట్ ను చంద్రబాబు మంత్రి అమర్నాథ్ రెడ్డికి కేటాయించారు. 2014 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అమర్నాథ్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

అందుకే: కోడెల మీద దాడిపై తేల్చేసిన వైసిపి నిజనిర్ధారణ కమిటీ
మాండ్యా: జేడీ(ఎస్)‌కు చుక్కలు చూపిస్తున్న సుమలత