చీరాల వైసిపి అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై కేసు నమోదు

Published : Apr 09, 2019, 09:49 PM IST
చీరాల వైసిపి అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై కేసు నమోదు

సారాంశం

ఎన్నికల ప్రచారం గడువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు ముగిసిన తర్వాత ఆమంచి సమావేశం నిర్వహించారు. దీంతో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఒంగోలు: చీరాల వైఎఎస్సార్ కాంగ్రెసు అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.. 

ఎన్నికల ప్రచారం గడువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు ముగిసిన తర్వాత ఆమంచి సమావేశం నిర్వహించారు. దీంతో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
 
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత ఆమంచి వైసీపీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అనుమతి లేదని పోలీసులు ఆమంచికి స్పష్టం చేశారు. 

దాంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ప్రసాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమంచి కూడా సీఐ ప్రసాద్‌పై ఫిర్యాదు చేశారు.

PREV
click me!

Recommended Stories

అందుకే: కోడెల మీద దాడిపై తేల్చేసిన వైసిపి నిజనిర్ధారణ కమిటీ
మాండ్యా: జేడీ(ఎస్)‌కు చుక్కలు చూపిస్తున్న సుమలత