చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా: వైఎస్ విజయమ్మ

Published : Mar 31, 2019, 02:39 PM IST
చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా: వైఎస్ విజయమ్మ

సారాంశం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా చంద్రబాబునాయుడు నెరవేర్చారా అని వైసీపీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమె ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

శ్రీకాకుళం:గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా చంద్రబాబునాయుడు నెరవేర్చారా అని వైసీపీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమె ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతున్నానని ఆమె ప్రశ్నించారు.ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104,  పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు.. ఇలా ప్రతి ఒక్కటీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మీ అందర్నీ కోరుతున్నా. రైతే రాజుగా చేశాడు. మళ్లీ జగన్‌ బాబు అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుంది.  9 ఏళ్లుగా జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారని ఆమె గుర్తు చేశారు.

ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్న వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్‌ విజయమ్మ కోరారు.  వైఎస్సార్‌సీపీ ప్రజల కోసమే పుట్టిందని.. ఇది అందరి పార్టీ అని ఆమె చెప్పారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్