ఎన్నికల ప్రచారంలో వల్లభనేని వంశీ.. పాలాభిషేకం చేసిన గ్రామస్థులు

Published : Mar 30, 2019, 11:20 AM IST
ఎన్నికల ప్రచారంలో వల్లభనేని వంశీ.. పాలాభిషేకం చేసిన గ్రామస్థులు

సారాంశం

టీడీపీ అభ్యర్థి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరుదైన ఘనత దక్కింది. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పార్టీ నేతలంతా ప్రచారంలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

టీడీపీ అభ్యర్థి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరుదైన ఘనత దక్కింది. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పార్టీ నేతలంతా ప్రచారంలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. కాగా... శనివారం వల్లభనేని వంశీ కూడా తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాగా.. ఆ ప్రచారంలో ఆయనకు అనుకోని గొప్ప అనుభవం ఎదురైంది.

గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంలో ప్రచారానికి వెళ్లగా.. ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు.. ఆయన ముందే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం ఆయన సమక్షంలో 245 మంది వివిధ పార్టీల కార్యకర్తలు టీడీపీలో చేరారు.
 
 ఇప్పటి వరకు వంశీ పర్యటించిన ప్రతీ గ్రామంలో ఆయన ప్రచారానికి భారీ స్పందన వస్తోంది. చాలా మంది వంశీ వెంట నడుస్తున్నారు. మరోవైపు, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్న వార్త జిల్లా దాటి రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది. దీంతో అక్కడ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్