చంద్రబాబు గజదొంగ.. మోహన్ బాబు

Published : Apr 05, 2019, 09:56 AM IST
చంద్రబాబు గజదొంగ..  మోహన్ బాబు

సారాంశం

రాష్ట్రాన్ని దోచేసిన గజదొంగ చంద్రబాబు అని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు అన్నారు. గురువారం ఆయన వైసీపీ మద్దతుగా భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.

ఆయన ఐదేళ్ల పాలన దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగిపోయిందన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయరన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం అథోగతేనంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని పార్టీలు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని ఓటర్లకు మోహన్ బాబు కోరారు.

సైకిల్‌కు అసలు స్టాండే లేదని, మనకు ఏసీ ఉన్నా ఫ్యానే కావాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన అంత మోసగాడు రాష్ట్రంలోనే ఎవరూ లేరని మోహన్‌ బాబు మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో జగన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. అందరూ వైసీపీ నేతలకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన ఈ సందర్భంగా కోరారు. 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్