హాస్య నటుడు అలీ ప్లేట్ ఫిరాయింపు: వైసిపిలోకి జంప్, ముహూర్తం ఖరారు

Published : Mar 10, 2019, 10:06 PM IST
హాస్య నటుడు అలీ ప్లేట్ ఫిరాయింపు: వైసిపిలోకి జంప్, ముహూర్తం ఖరారు

సారాంశం

అలీ వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంపై సందిగ్దం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఆయన టీడీపిలో చేరుతారని రెండు మూడు రోజుల క్రితం ప్రచారం జరిగింది.

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు అలీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం ఉదయం వైసిపిలో చేరనున్నారు. అలీకి వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.

అలీ వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంపై సందిగ్దం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఆయన టీడీపిలో చేరుతారని రెండు మూడు రోజుల క్రితం ప్రచారం జరిగింది. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. 

చివరకు అలీ వైసిపి గూటికి చేరుతున్నారు. అలీ వైసీపీలో చేరితే ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా అనే ప్రశ్నలకు త్వరలో సమాధానాలు లభించనున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే