రోజావి పగటి కలలు.. ఎమ్మెల్యే అనిత

Published : Mar 01, 2019, 12:12 PM IST
రోజావి పగటి కలలు.. ఎమ్మెల్యే అనిత

సారాంశం

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అనిత జోస్యం చెప్పారు. 


వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అనిత జోస్యం చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడని వైసీపీ ఎమ్మెల్యే  రోజా కలలు కుంటోందని ఆమె అన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపడతారని.. రోజా కన్నకలలు అన్నీ పగటి కలలు అయిపోతాయన్నారు.

శుక్రవారం ఎమ్మెల్యే అనిత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీ మళ్లీ గెలిపిస్తాయని అభిప్రాయపడ్డారు.

మళ్లీ అధికారంలోకి తాము రావడం ఖాయమన్నారు. కాగా.. రాష్ట్రంలో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే