చంద్రబాబు ఇలాకలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీ వలసలు

Published : Mar 01, 2019, 11:50 AM IST
చంద్రబాబు ఇలాకలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీ వలసలు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాకా చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాకా చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలోని టీడీపీ నేతలు పలువురు వైసీపీ బాట పట్టారు.  చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడం.. పార్టీ నేతలను కలవరపెడుతోంది.

శుక్రవారం టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  సమక్షంలో శుక్రవారం టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ వైఎస్‌ జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి సమక్షంలో చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్‌ సురేష్‌, టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌ మాపక్షి మోహన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్‌, టీడీపీ కార్పొరేటర్లు నవీన ఇందు, శ్రీకాంత్, సహదేవన్‌, చంద్రయ్య, డేవిడ్‌, ముత్తయ్య, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు వేలంగాని, ఎంపీటీసీ రాధమ్మ, ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ లతా శ్రీధర్‌ తదితరులు పార్టీలో చేరారు. వీరితోపాటు మంగళగిరి చెందిన కొందరు నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే