కేక్ వాక్ కాదు: జేసీ బ్రదర్స్‌కు అసమ్మతి సెగ

Published : Feb 26, 2019, 06:26 PM IST
కేక్ వాక్ కాదు: జేసీ బ్రదర్స్‌కు అసమ్మతి సెగ

సారాంశం

తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. జేసీ దాయాది చిత్తరంజన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

తాడిపత్రి: తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. జేసీ దాయాది చిత్తరంజన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

2014 ఎన్నికలకు ముందు జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అయితే జేసీ సోదరులు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో టీడీపీలో ఉన్న క్యాడర్, నేతలు జేసీ సోదరులకు దూరంగా ఉంటున్నారు.

జేసీ దాయాది చిత్తరంజన్ రెడ్డి మంగళవారం నాడు సమావేశం ఏర్పాటు చేసి టీడీపీలో ప్రాధాన్యత లేదని కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం గమనార్హం.  ఇప్పటికే బోగాటి నారాయణరెడ్డి పార్టీకి దూరమయ్యారు. గన్నెవారిపల్లి సర్పంచ్ రమణ జేసీకి దూరంగా ఉంటున్నట్టు ప్రచారం సాగుతోంది.

గతంలోనే ఫయాజ్, జగదీశ్వర్ రెడ్డి, రంగనాథ్ లాంటి నేతలు  కూడ జేసీ సోదరులకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.  జేసీ సోదరులు ఏ పార్టీలో ఉన్నా కూడ వారికి ఓ వర్గం ఉంటుంది. కానీ, తమపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్తున్నా కూడ జేసీ సోదరులు మాత్రం స్పందించడం లేదు.
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu