కాటసాని ఎఫెక్ట్: వైసీపీకి గౌరు చరితారెడ్డి షాక్?

By narsimha lodeFirst Published Feb 26, 2019, 4:22 PM IST
Highlights

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైసీపీ నేత వెంకట్ రెడ్డిలు మంగళవారం నాడు కార్యక్తలతో సమావేశమయ్యారు.


కర్నూల్:  పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైసీపీ నేత వెంకట్ రెడ్డిలు మంగళవారం నాడు కార్యక్తలతో సమావేశమయ్యారు. వైసీపీకి గౌరు దంపతులు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

గత ఎన్నికల్లో  పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్  నుండి గౌరు చరితారెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  గత ఎన్నికల్లో చరితారెడ్డి చేతిలో ఓటమి పాలైన కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలం క్రితం వైసీపీలో చేరారు.

పాణ్యం టిక్కెట్టు కోసం గౌరు చరితారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. జగన్ తనకు టిక్కెట్టు విషయమై హామీ ఇచ్చారని గౌరు  చరితారెడ్డి గతంలో ప్రకటించారు.

కానీ పార్టీలో చోటు చేసుకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో గౌరు చరితారెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారే విషయమై చర్చిస్తున్నారు.

గౌరు దంపతులు టీడీపీలో చేరుతారని కూడ ప్రచారం సాగుతోంది.పాణ్యం అసెంబ్లీ టిక్కెట్టు విషయమై జగన్  నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే గౌరు దంపతులు పార్టీ మారాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సమావేశం తర్వాత గౌరు దంపతులు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

click me!