ఆస్తి కోసం తల్లిదండ్రులపై కసాయి కొడుకు హత్యాయత్నం... పెట్రోల్ పోసి

Published : Mar 04, 2019, 02:39 PM ISTUpdated : Mar 04, 2019, 02:40 PM IST
ఆస్తి కోసం తల్లిదండ్రులపై కసాయి కొడుకు హత్యాయత్నం...  పెట్రోల్ పోసి

సారాంశం

అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన కన్న కొడుకే ఆ తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులన్న ప్రేమ కాదుకదా వృద్దులన్న దయ కూడా వారిపై చూపించలేదు. ఆస్తి కోసం వారిని అతి దారుణంగా హతమార్చడానికి వెనకాడలేదు. ఇలా కన్న కొడుకు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి సదరు తల్లిదండ్రులు ఆస్పత్రిలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.   

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గంలో నివాసముండే నారాయణ రెడ్డి(79)-నరసమ్మ(73) భార్యాభర్తలు. వీరికి శేషారెడ్డి, మధుసూదన్ రెడ్డి, హనుమంతరెడ్డి అనే ముగ్గురు కుమారులున్నారు. అందరికి పెళ్లిళ్లు కాగా  ఇద్దరు కొడుకులు వేరు వేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయి అక్కడే నివాసముంటున్నారు. రెండవ కొడుకు కుటుంబంతో కలిసి తల్లిదండ్రులు నివాసముండే ఇంటిపక్కన మరో ఇంట్లో వుంటున్నాడు. 

ఈ క్రమంలో తల్లిదండ్రుల పేరిట వున్న రెండు ఇళ్లు, రెండున్నర ఎకరాల మాగాణిని తన సొంతం చేసుకోవాలని మధుసూదన్ రెడ్డి భావించాడు. దీంతో గతకొన్ని రోజులుగా తల్లిదండ్రలతో ఈ విషయం గొడవ పడుతున్నాడు. ఇదేమాదిరిగా  ఆదివారం కూడా అతడు తల్లిదండ్రులతో గొడవ పడి ఆగ్రహంతో దారుణానికి పాల్పడ్డాడు. వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి  చంపడానికి ప్రయత్నించాడు. 

మంటల్లో చిక్కుకున్న నారాయణ రెడ్డి -నరసమ్మ దంపతులను గమనించిన చుుట్టుపక్కల ఇళ్లవారు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోందని పరిస్థితి ఇంకా విషమంగానే వున్నట్లు వైద్యులు తెలిపారు. 

తమ సోదురుడే తల్లిదండ్రులపై హత్యాయత్నానికి పాల్పడినట్లు మిగతా ఇద్దరు కొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu