అనంతపురంలో టీడీపీకి షాక్.. సీనియర్ నేత రాజీనామా

Published : Mar 01, 2019, 10:24 AM IST
అనంతపురంలో టీడీపీకి షాక్.. సీనియర్ నేత రాజీనామా

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అనంతపురంలో ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అనంతపురంలో ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, ఐడీసీ మాజీ ఛైర్మన్ నలపరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని ఆయన అధికారికంగా  ప్రకటించారు. అయితే.. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఆయన స్పందించారు. తన సన్నిహితులతో చర్చించి.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

కాగా.. రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నల్లపరెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓటు బ్యాంకుకు కొంత గండిపడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే