
కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు చేరుకున్న పొట్లూరి జగన్‌తో సమావేశమయ్యారు.
అనంతరం వరప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన కాకినాడ ఎంపీ తోట నర్సింహులు ఆయన భార్య వాణితో కలిసి బుధవారం జగన్‌తో భేటీ అయ్యారు.