
వివాదాస్పద దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ.. దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఏపీ ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపించేలా ఉందని ఆయన ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో చంద్రబాబుని కావాలని నెగిటివ్ గా చూపించారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్‌లో తలమునకలయ్యాడు. ఈ నెల 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయనున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. మరి సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.
డైరెక్షన్ చేసి లక్కును పరీక్షించుకున్న టాప్ యాక్టర్స్