
నరసరావుపేట పార్లమెంటు స్థానం తనదేనన్నారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన మా కుటుంబం ఎలా పనిచేసిందో సీఎం చంద్రబాబుకు తెలుసునని స్పష్టం చేశారు.
అవినీతి, కమీషన్లు, లంచాలు, మాఫీయా పనులు తమకు తెలియవని రాయపాటి వెల్లడించారు. మా కుటుంబానికి ఈసారి 2 టిక్కెట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేను, నా కుమారుడు, ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు.