అర్థరాత్రి హింసిస్తున్నారు: పోలీసులను ఆశ్రయించిన టీడీపీ నేత యామిని

By Nagaraju penumalaFirst Published Mar 8, 2019, 8:41 PM IST
Highlights

కొందరు వ్యక్తులు తన మొబైల్‌ నెంబర్‌ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో పోస్టు చేశారని తెలిపారు. దాంతో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్లు చేసి హింసిస్తున్నారని వాపోయారు. రాజకీయ పరంగా విమర్శలు చెయ్యడాన్ని స్వాగతిస్తానని కానీ హద్దుమీరితే ఊరుకునేది లేదని హెచ్చరించారు యామిని.    
 

అమరావతి: సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ట్విటర్‌ వేదికగా తనను ట్రోల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సైబర్‌ చట్టాలు ఉన్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా తమపై అనుచితంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ వాపోయారు. అన్ని పార్టీల్లోనూ మహిళా నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందన్నారు. రాజకీయ నాయకులుగా ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని చెప్పుకొచ్చారు. 

అయితే సోషల్‌మీడియాలో మాత్రం విపరీతమైన ధోరణితో వేధింపులకు పాల్పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. తన విషయంలో వేధింపులు కొనసాగుతున్నాయిని తెలిపారు. కొందరు వ్యక్తులు తన మొబైల్‌ నెంబర్‌ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో పోస్టు చేశారని తెలిపారు. 

దాంతో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్లు చేసి హింసిస్తున్నారని వాపోయారు. రాజకీయ పరంగా విమర్శలు చెయ్యడాన్ని స్వాగతిస్తానని కానీ హద్దుమీరితే ఊరుకునేది లేదని హెచ్చరించారు యామిని.    

click me!