
టీడీపీ సీనియర్ నేత, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉదయం వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌కు వచ్చిన ఆయన జగన్‌తో సమావేశమయ్యారు.
చంద్రశేఖర్‌ను వైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ వెంట తీసుకొచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం,టీడీపీలో అభ్యర్థుల జాబితా తుది దశకు చేరడంతో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.