వస్తున్నా నీ సంగతి తేలుస్తా.. బొత్సకు పవన్ వార్నింగ్

Published : Mar 01, 2019, 02:53 PM ISTUpdated : Mar 01, 2019, 06:27 PM IST
వస్తున్నా నీ సంగతి తేలుస్తా.. బొత్సకు పవన్ వార్నింగ్

సారాంశం

గతంలో ఆడపడుచులు విజయనగరం జిల్లాలో తరిమితరిమి కొట్టిన సంగతి నువ్వు మరచిపోయావేమో నేను మరచిపోలేదన్నారు. మరోసారి ఆడపడుచుల చేత కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల్లో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

కడప: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కడప జిల్లా రైల్వే కోడూరు బహిరంగ సభలో బొత్స సత్యనారాయణపై రెచ్చిపోయారు పవన్. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయిందని కుమ్మక్కు అయ్యిందంటూ ఆరోపిస్తున్న బొత్స సత్యనారాయణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

త్వరలోనే విజయనగరం జిల్లా వస్తా నీ సంగతి తేలుస్తానంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో ఆడపడుచులు విజయనగరం జిల్లాలో తరిమితరిమి కొట్టిన సంగతి నువ్వు మరచిపోయావేమో నేను మరచిపోలేదన్నారు. మరోసారి ఆడపడుచుల చేత కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. 

జనసేన పార్టీ కార్యకర్తల్లో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురవ్వొద్దని మన పార్టీ ఒక్క వామపక్షాలతోనే తప్ప మరే ఇతర పార్టీతో  కలిసి పోటీ చెయ్యదన్నారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి పొత్తులు ఉండవన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని జనసేన అధినేత పవన్ హితవు పలికారు.
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu