ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

By narsimha lodeFirst Published Mar 1, 2019, 1:23 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

ఏపీ రాష్ట్రంలోని  ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 12వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది.  ఐదు స్థానాలకు  ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  టీడీపీ నుండి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు,  ఏపీ ఏన్జీవో నేత ఆశోక్‌బాబు,  దువ్వారపు రామారావు, బీటీనాయుడులు, వైసీపీ నుండి  జంగా కృష్ణమూర్తి లు నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. నామినేషన్లు  సక్రమంగా ఉన్నాయని తేల్చారు. దీంతో ఈ ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.
 

click me!