జగన్ సర్వేలన్నీ బోగస్, టీడీపీలోకి వైసీపీ నేతలు: కేఈ

Published : Mar 01, 2019, 02:00 PM IST
జగన్ సర్వేలన్నీ బోగస్, టీడీపీలోకి వైసీపీ నేతలు: కేఈ

సారాంశం

జగన్ సర్వేలన్నీ బోగస్  సర్వేలేనని  ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఏపీలో చంద్రబాబునాయుడు పాలన చూసి అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  

కర్నూల్: జగన్ సర్వేలన్నీ బోగస్  సర్వేలేనని  ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఏపీలో చంద్రబాబునాయుడు పాలన చూసి అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

 పాణ్యం ఎమ్మెల్యే , వైసీపీకి రాజీనామా చేసిన గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డిలు శుక్రవారం నాడు ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని  కలిశారు.ఈ సందర్భంగా  కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. 

కోట్ల, కేఈ కుటుంబాలు కలిసి పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదన్నారు. రేపు కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వస్తున్నట్టు కేఈ కృష్ణమూర్తి చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్టు  గౌరు చరితారెడ్డి ప్రకటించారు.  ఈ నెల 9వ తేదీన బాబు సమక్షంలో గౌరు దంపతులు టీడీపీలో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

జగన్‌కు షాక్: వైసీపీకి గౌరు చరిత రాజీనామా


 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు