జేసి ఫిర్యాదు: మీసం మెలేసిన మాధవ్ పై పోలీస్ కేసు

Published : Mar 02, 2019, 08:05 AM IST
జేసి ఫిర్యాదు: మీసం మెలేసిన మాధవ్ పై పోలీస్ కేసు

సారాంశం

తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని జెసి తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎంపీ దివాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు.

అనంతపురం: తనపై మీసం మెలేసిన మాజీ పోలీసాఫీసర్, ప్రస్తుత వైసిపి నేత మాధవ్ పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్‌పై విచారించిన కోర్టు ఆదేశాల మేరకు మాధవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద గొడవలు జరిగిన సమయంలో పోలీసులను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దూషించారు. దీంతో అప్పటి సీఐ మాధవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తానంటూ జేసీని ఉద్దేశించి హెచ్చరిస్తూ మీసం మెలేసిన విషయం తెలిసిందే.
 
ఒక సీనియర్‌ పొలిటీషియన్‌, పైగా ఎంపీ అయిన తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని జెసి తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎంపీ దివాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu