పవన్ వెనక చంద్రబాబు, పాక్ వాడుకుంది: జీవీఎల్

By telugu teamFirst Published Mar 2, 2019, 12:06 PM IST
Highlights

పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనతో బిజెపి నాయకులు అన్నట్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనే జీవీఎల్ నరసింహారావు శనివారం మీడియా సమావేశంలో స్పందించారు.

హైదరాబాద్: పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వెనక చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు.

పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనతో బిజెపి నాయకులు అన్నట్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనే జీవీఎల్ నరసింహారావు శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలను పాకిస్తాన్ వాడుకుందని అన్నారు. బిజెపిని దెబ్బ తీయాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. 

అధికారానికి దారేదిలా పవన్ కల్యాణ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో అనే విషయాన్ని నిజం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎపిలో బిజెపి తిరుగులేని శక్తిగా మరాతుందని ఆయన అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సైన్యం ఒక్క దాడితో ఎంతో మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని ఆయన అన్నారు. 

ప్రపంచమంతా మోడీని, సైన్యాన్ని ప్రశంసిస్తుంటే చంద్రబాబు మాత్రం రాజకీయాల కోసం అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. పుల్వామా దాడిని రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, పాకిస్తాన్ మెడలు వంచి మోడీ అభినందన్ ను దేశానికి తీసుకుని రాగలిగారని అన్నారు. 

చంద్రబాబు ఏం మాట్లాడారో చూశామని, జాతీయ భద్రత అంశాలను రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. చంద్రబాబు లొల్లి రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం చంద్రబాబు విశాఖ రైల్వే జోన్ ను కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు.

click me!